కేసీఆర్‌కు చావో రేవో.. పరువు కోసం పాకులాట

0
24

కేసీఆర్ గతంలో చూడని రాజకీయం చూస్తున్నారు. ఆయన ప్రభావం తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు అయస్కాంతంలా పనిచేసిన ఆయన పేరు.. ఇపుడు శక్తి కోల్పోయినట్టు అనిపిస్తుంది. తన దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవటం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జంప్ లు కొడుతుండటంతో.. కేసీఆర్‌ కు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని సీట్లు గెలుచుకుని సత్తా చాటుకుంది బీఆర్ఎస్. ఐతే.. లోక్ సభ ఎన్నికల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులే దొరకడం లేదు. ఎంపీగా పోటీ చేస్తే.. కనీసం వంద కోట్లు ఖర్చు చేయాల్సిందేనని నేతల లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ దూకుడు మీద ఉండటం… రాష్ట్రంలో వేవ్ మారిపోవడంతో.. ఓడిపోయి వంద కోట్లు పోగొట్టుకోవడం కంటే సైడ్ అయిపోవడం బెటర్ అనుకుంటున్నారు చాలామంది లీడర్లు.

ఇప్పటికే బీఆర్ఎస్ లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీజేపీ నుంచి పోటీకి రెడీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎర్త్ పెట్టారు. దక్షిణ తెలంగాణ ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లలోనూ కాంగ్రెస్ హవా గ్యారంటీ. అక్కడ బీఆర్ఎస్ సోదిలో కూడా లేదు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ బాట పట్టారు. నామా నాగేశ్వరరావు అనేక ప్రయోజనాలు గతంలో పొందారు కాబట్టి మొహమాటానికి నామా ఎంపీ బరిలో నిలబడ్డారని చెబుతున్నారు. సిటీ సహా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. మహబూబ్ నగర్ సీటు, వరంగల్, మహబూబాబాద్‌లోనూ బీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితి ఫేస్ చేస్తోంది. తలసాని కొడుకు సాయి ఈసారి సికింద్రాబాద్ లో నిలబడ్డా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఓడిపోయినా కనీసం గట్టిపోటీ ఇవ్వాలని.. మంచి ఓట్లు సంపాదించాలన్న దానిపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టు వినిపిస్తోంది.