TG politics: బీఆర్ఎస్ కు కేకే గుడ్ బై ?

0
24

బీఆర్ఎస్ కు రాజ్యసభ ఎంపీ కేకే షాక్ ఇవ్వబోతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లారు. బీఆర్ఎస్కు ఒకటి రెండు రోజుల్లో గుడ్ బై చెప్పబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్తో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దానంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత వారం కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ స్వయంగా మేయ ర్ ఇంటికి వెళ్లి కలిశారు.

పార్టీలోకి రావాలని మున్షీ ఆహ్వానించినట్లు మేయర్ వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ లోకి రావాలనే ఆహ్వానంపై అనుచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయలక్ష్మీ తెలిపారు. మరోవైపు మార్చి 26న కేకేకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫోన్ చేసి రావాలని పిలిచినా ఆయన వెళ్లలేదని తెలుస్తోంది. గతంలో కేకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా, ఎంపీగా కే కేశవరావు ఉన్నారు. త్వరలోనే హస్తం గూటికి

హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే పదికి పైగా కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్లో సత్తాచాటాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. మేయర్ విజయలక్ష్మీతో పాటు ఆమె తండ్రి కేకేను పార్టీలోకి చేర్చుకునేందుకు తుది దశ చర్చలు ముగిసినట్లు సమాచారం.