TG Politics: తెలంగాణలో మొత్తం 3.3 కోట్ల ఓటర్లు

0
21

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.3 కోట్లుగా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. వీరిలో 1,65,95,896మంది మహిళలు, 1,64,14,693మంది పురుషులు, 2729మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు. ఇక తొలితరం ఓటర్లు 8,72,116మంది, 85ఏళ్లు దాటినవారు 1,93,489మంది, దివ్యాంగులు 5,26,286మంది, సర్వీసు ఓటర్లు 15,472మంది, ఎన్నారై ఓటర్లు 3409మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం 9, 14, 354 మంది ఓట్లను తొలగించారు. తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3,30,13,318 మందికి చేరింది. పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.నూతనంగా ఓటరు నమోదుతోపాటు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు మార్చుకునేందుకు వచ్చే నెల 15 వరకు గడువు ఉందని చెప్పారు.

మరోవైపు లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఓట్ల తొలగింపు, వివరాలు సవరణ ప్రక్రియ ఉండబోదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల నియామవళి అమలు, తనిఖీల్లో భాగంగా రూ.38.12 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు.