Delhi Liquor Scam: స్నాక్స్, టీ, పప్పు అన్నం… తీహార్ జైల్లో కవిత మెనూ ఇదే

0
23

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ తీహార్ కారాగారంలో ఉన్న సంగతి తెలిసిందే. కవిత జైలు కు వెళ్లి ఒకరోజు గడిచింది. జైలులోని 6వ నంబర్ విభాగంలో మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి కవిత ఉంటున్నారు. బుధవారం ఉదయం స్నాక్స్ తో పాటు టీ తాగారని, మంగళవారం రాత్రి అన్నం, పప్పుతో భోజనం చేశారని సమాచారం. తనతో పాటు జైలులో ఉన్న మరో ఇద్దరు మహిళా ఖైదీలకు కూడా కవిత ఆహారం వడ్డించారని, జైలులో తొలిరోజున పుస్తక పఠనంతో పాటు టీవీని వీక్షించారని చెబుతున్నారు.

టీ, ఆహారం, టీవీ చూసే సమయాలు ఇతర ఖైదీల మాదిరిగానే కవితకూ ఉంటా జైలు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కవిత ప్రత్యేకం గా నిర్దిష్ట వసతులు ఏమీ డిమాండ్ చేయలేదని జైలు వర్గాలు వివరించాయి. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువు లను అందజేస్తామని వివరించారు. ఇదే కేసులో అరెస్టయి తీహార్ జైల్లో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ ఉన్నా రు.

సిసోడియా జైలు నంబర్ 1, సంజయ్ సింగ్కు జైలు నంబర్ 2ను కేటాయించారు. మరో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత సత్యేంద్రకుమార్ను ఏడో నంబర్ జైలులో ఉంచారు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు వచ్చేనెల 9 వరకు రౌజ్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. ఆమె తరపు లాయర్లు మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది.