TG Politics: కొత్తతరం నాయకత్వం తయారు చేస్తాం : కేటీఆర్

0
20

బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు వలసవెళ్లడం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందింంచారు.

శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్..! ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్..!! ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు.!

ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.! నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం .! కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీని వీడిన ప్రముఖ నేతల్లో ఎంపీ రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్(కాంగ్రెస్), బీబీపాటిల్, పి.రాములు, జి.నగేశ్, ఆజ్మీరా సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైదిరెడ్డి, ఆరూరి రమేశ్(బీజేపీ) ఉన్నారు. వీరిలో చాలామంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు దక్కించుకోవడం గమనార్హం.