TG Politics: రేపు కాంగ్రెస్ లో చేరుతా: కేకే

0
14

రేపు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ కీలక నేత కె.కేశవరావు. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో కే కేశవరావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి 24 గంటల ముందు.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన ఫాంహౌస్ లో చర్చించారు. ఆ తర్వాతే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

తెలంగాణ కోసం ఎంపీలతో కలిసి పోరాటం చేశానన్నారు కేకే. . ఏనభై ఐదేళ్ల జీవితంలో 55 ఏళ్ళు కాంగ్రెస్ లోనే ఉన్నా. మంత్రిగా, ఎంపీగా, సీడబ్ల్యూసీ మెంబర్ గా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ఎంతో చేసిందని చెప్పారు. తెలంగాణపై తీర్మాణం చేసినప్పుడు కాకా వెంకటస్వామితో కలిసి పనిచేశా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటకు చాలా విలువ ఇచ్చారు.13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంత ఇంటికి వస్తున్నా. కాంగ్రెస్ లో చేరతానని చెప్పారు.

1998 నుంచి తెలంగాణ పోరాటం మొదలైందన్నారు కేకే. ఆరు వర్కింగ్ కమిటీలు ఏర్పాటు అయ్యాయి.. వార్ గ్రూపులో తాను సభ్యుడిగా పనిచేశా. . బీఆర్ఎస్‌ను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉంది.