Tamil actor Daniel Balaji: ఘర్షణ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

0
30

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. నిన్న రాత్రి గుండెపోటుతో హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని పురసైవాల్కంలోని ఆయన నివాసానికి తరలించారు.

బాలాజీ వెట్టయాడు విలయాడు, వడా చెన్నై వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. తెలుగులో వెంకటేశ్ ఘర్షణ సినిమాలో పోలీసు పాత్రలో కనిపించారు. బాలాజీ మృతి పట్ల తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం యాభైకి పైగా సినిమాలు చేశాడు. చిత్రాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేశాడు.

డేనియల్ బాలాజీ 1975లో జన్మించారు. కమల్ హాసన్ విడుదల కాని మూవీ మారుతానాయక్‌లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. మలయాళంలో తొలిసారి బ్లాక్ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత మోహన్‌లాల్ నటించిన భగవాన్ మమ్ముట్టి నటించిన డాడీ కూల్ చిత్రాల్లో నటించాడు.