Delhi: రేపు రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ

0
18

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 13పార్టీల నేతలు దీనిలో పాల్గొననున్నారు. తాన్‌షాహీ హఠావో-లోక్‌తంత్ర బచావో అన్న నినాదంతో ఈ సభను నిర్వహిస్తామని కూటమి నేతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ సహా పలువురు ప్రముఖులు సభకు హాజరుకానున్నారు.

కాంగ్రెస్ కు ఐటీ నోటీసులు

మరో వైపు 2017–18 నుంచి 2020–21 మధ్య కాలానికి గాను రూ. 1,823.08 కోట్ల ఇన్ కం ట్యాక్స్ కట్టాలంటూ తాజాగా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పెనాల్టీ, వడ్డీతో కలిపి ఈ మేరకు మొత్తం డబ్బులు కట్టాలంటూ ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఎన్నికల సమయంలో కావాలనే పార్టీని ఇబ్బందులు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలా ఐటీ శాఖ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందంటూ ఆరోపించింది. కాంగ్రెస్​కు ఐటీ శాఖ తాజా నోటీసులపై పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కుట్రపూరితంగా బీజేపీకి సహకరించిన అధికారులపై కేంద్రంలో ప్రభుత్వం మారిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.

అలాగే తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శక్తిమంతమైన మహిళలు దేశ భవిష్యత్తును మారుస్తారని అన్నారు. ప్రస్తుతం ప్రతి 10 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే స్త్రీలు ఉన్నారని చెప్పారు.