IPl 2024: ధర రూ.24 కోట్లు ఒక్క వికెట్టూ తీయలేదు.. నెటిజన్లు ట్రోల్స్

0
30

ఐపీఎల్ చరిత్రలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచారు. మినీ వేలంలో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్‌ టైటాన్స్‌, కేకేఆర్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 2 మ్యాచులాడిన అతడు.. ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం.

మొత్తం 8 ఓవర్లు వేసిన స్టార్క్.. ఏకంగా 100 రన్స్ ఇచ్చారు. దీంతో అతడి ప్రదర్శనపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ లీగ్‌లో తమ జట్టుకు స్టార్క్‌ కీలకమవుతాడని మెంటార్ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. తీరా, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విఫలం కావడం గమనార్హం. మరోవైపు యువ పేసర్ హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్‌తో కోల్‌కతా విజయం కోసం కష్టపడ్డాడు.

ఐపీఎల్​ 2024లో మోస్ట్​ ఎక్స్​పెన్సివ్​ ప్లేయర్​ మిచెల్​ స్టార్క్​ ప్రదర్శన చూసిన కేకేఆర్​ అభిమానులు, క్రికెట్​ లవర్స్​ షాక్​ అవుతున్నారు. అతడిని దారుణంగా ట్రోల్​ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ రూ.2 కోట్లు మాత్రమే తీసుకుని.. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా 4 వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని.. కానీ స్టార్క్‌ అందుకు భిన్నంగా ఉన్నాడని పేర్కొంటున్నారు.