Telangana:  ఏప్రిల్ 2 వరకు వడగాలులు .. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

0
16

తెలంగాణలో మార్చిలోనే ఎండలు దంచికొడు తున్నా యి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండడంతో జనం అల్లాడి పోతున్నారు. ఏప్రిల్ 2వరకు రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెక్ట్ను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగా రెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వీస్తాయని తెలిపింది.

ప్రసు తం ఉదయం 11 గంటలకే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. సూర్యుడి భగభగలతో రాష్ట్రం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఎండ వేడికి ప్రజలు విలవిల లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలం గాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు శుక్రవారం నాటికి మరింత పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు తెలి పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరా బాద్లో గురువారం 43.1 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించారు.

మరోవైపు ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి ఇవాళే చివరి పనిదినం. మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.