TG Politics: కేటీఆర్‌కు ఉచ్చు బిగిస్తున్న రేవంత్ రెడ్డి

0
32

తెలంగాణ రాజకీయం బీఆర్ఎస్ అగ్రనేతల అవినీతి చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ ఎటాకింగ్ ప్లాన్స్ తో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా.. మిగతా లీడర్లంతా వణికిపోతున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇది ఎక్కడికి వెళ్తుందన్న చర్చ అంతటా నడుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. రూ.2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట హనుమకొండ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేటీఆర్ తమ హయాంలో మున్సిపల్‌ శాఖను చూశారు. అదే శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా డబ్బులిస్తేనే బిల్డింగులకు అనుమతులు మంజూరు చేస్తున్నారనీ.. అలా వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపారనీ ఇటీవల కేటీఆర్ ఆరోపించారు. ఓవైపు ఇసుక దందా, రైస్‌ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు, రియల్టర్లను బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారు. కత్తెర పెట్టుకుని జేబు దొంగలా తిరుగుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల ఆరోపించడంపై రేవంత్ సహా.. మిగతా కాంగ్రెస్ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు.