AP Politics: ఏపీలో ఎన్నికల వార్.. ఫ్యాన్ ముక్కలైతది: చంద్రబాబు

0
28

ఏపీలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. కూటమికి, అధికార పార్టీ వైసీపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆరోపణలు,విమర్శలతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.

ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. వైసీపీ పెత్తందారులు, భూస్వాముల పార్టీ. ఆ పార్టీలో ఒకే సామాజికవర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు. జగన్ శవ రాజకీయాలు నమ్మొద్దు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి. మాది పేదల పక్షం.. ప్రజలతోనే ఉంటాం. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పేర్కొన్నారు.

మరో వైపు చంద్రబాబువి పిల్ల చేష్టలు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కత్తి కట్టారు. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారు. చంద్రబాబు కడుపుమంటతో మంచి వ్యవస్థను ఆపించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ అందకుండా చేశారు. వాలంటీర్లు సీఎం జగన్‌కు మేలు చేస్తారని ఆయన భయం. చంద్రబాబుది మోసపూరిత రాజకీయం’ అని ఆయన మండిపడ్డారు.