గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డు నెలకొల్పారు. గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచారు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేసిన రషీద్‌తో మ్యాచులో క్లాసెన్ వికెట్ తీయడంతో ఈ ఘనత అందుకున్నారు.
రషీద్ ఇప్పటివరకు గుజరాత్ తరఫున 49 వికెట్లు తీశారు. ఆ తర్వాతి స్థానంలో స్టార్ బౌలర్ షమీ(48) ఉన్నారు. గాయం కారణంగా షమీ ఈ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ లో షమీని.. కొన్ని మ్యాచ్ల అనంతరం జట్టులోకి తీసుకోగా తన బౌలింగ్ బలంతో వికెట్ల మీద వికెట్లు పడగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.