Ayodhya: రేపటి నుంచి హైదరాబాద్ TO అయోధ్యకు డైరెక్ట్‌ ఫ్లైట్

0
22

ఆయోధ్య బాల రాముడి దర్శనానికి వెళ్తే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీసు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్టు చెప్పారు.

దీనిపై స్పందించిన సింధియా.. వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వివరించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు(మంగళ, గురు, శనివారం) స్పైస్ జెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఉదయం 10:00 గంటలకు బయల్దేరి 12:45కు అయోధ్యకు చేరుకుంటాయి. అవే రోజుల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ చేరుకుంటుంది.

అయితే.. అయోధ్యలో రామమందిరం ప్రారంభానికి ముందే.. అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంతో పాటు పర్యటక ప్రదేశంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నించగా.. ఈ మేరకు ఆయా రాష్ట్రాల నుంచి డైరెక్టుగా అయోధ్యకు విమాన సర్వీసులను క్రమంగా ప్రారంభిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రాంభించనుంది.