టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నటుడిగా మారుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘నా సొంత బయోపిక్‌లో నటించాలని నిర్ణయించుకున్నా. దర్శకుడు, నిర్మాత, స్క్రిప్ట్ రైటర్‌గా మారబోతున్నా. నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. రాబోయే కొన్నేళ్లలో బిగ్ స్క్రీన్‌పై తుది ఫలితాన్ని చూస్తారు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తా’ అని తెలిపారు. అయితే, యూవీ ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
1999 లో అండర్ 19 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించారు.2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు, ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు.
టి20 క్రికెట్లో తక్కువ బంతుల్లో (12) అర్ధ శతకం ఇప్పటికి యువరాజ్ పేరిట ఉంది. 2011 ప్రపంచ కప్ తరువాత యువికి కాన్సర్ అనే భయంకరమైన వ్యాధి సోకింది.తరువాత అందులో నుండి బయటపడ్డాక క్రికెట్ లో మళ్ళి పునరాగమనం చేసాడు. యువరాజ్ సింగ్ 40 టెస్టులు,304 వన్డేలు,58 టీ20లు ఆడిండు.యువరాజ్ సింగ్ 2019 జూన్ 10 తేదీన ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అర్జున, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు.