IPL 2024: KKRvsRR.. మ్యాచ్ తేదీ మార్పు!

0
32

ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోజు శ్రీరామ నవమి ఉండటంతో మ్యాచ్‌కు కావాల్సిన భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ సంఘానికి అక్కడి పోలీసులు తెలిపారు. మ్యాచ్ తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కోల్‍కతా, రాజస్థాన్ మధ్య ఏప్రిల్ 17న జరగాల్సిన ఈ మ్యాచ్ వాయిదా వేయాల్సి వస్తే.. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్నది బీసీసీఐకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ 2024 సీజన్ షెడ్యూల్‍ను రెండు దశలుగా బీసీసీఐ ఖరారు చేసింది. ముందుగా 21 మ్యాచ్‍ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. ఆ తర్వాత మిలిగిన 53 మ్యాచ్‍ల షెడ్యూల్ కూడా ఖరారు చేసింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ బుధవారం (ఏప్రిల్ 3) విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన వారు ఏప్రిల్ 14 నుంచి వరుసగా ఐదు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నారు.