TTD: తిరుమలలో ఫుల్ రష్.. 14 గంటల సమయం

0
24

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,027 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు సమకూరింది. పరీక్షలు ముగియడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

మరోవైపు ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

ఇక తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో సోమవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సు వెళుతుండగా హరిణి సమీపంలో అకస్మాత్తుగా అదుపు తప్పింది. పక్కనే ఉన్న రక్షణ గోడను, చెట్టును ఢీకొని లోయలోకి పడకుండా ఆగిపోయింది. భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.