IPL 2024: ముంబై ఇండియన్స్ రికార్డు.. తొలి జట్టుగా

0
34

ఐపీఎల్‌లో 250 మ్యాచులు ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచుతో ఈ మైలురాయిని అందుకుంది. ఇప్పటివరకు 16 సీజన్లలో MI ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా బెంగళూరు (244), ఢిల్లీ (241), కోల్‌కతా (239), పంజాబ్ (235), చెన్నై (228) ఉన్నాయి. నిషేదం కారణంగా 2016, 2017 సీజన్‌లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ 228 మ్యాచులు ఆడింది.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020 సీజన్‌లలో టైటిల్ గెలిచింది. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టలేదు. వరుసగా మూడో మ్యాచులోనూ ఓడిపోయింది. తొలి 2 మ్యాచులు ఇతర వేదికల్లో జరగ్గా.. ఇవాళ సొంతగడ్డపైనా సత్తా చాటలేకపోయింది.

బ్యాటర్లు విఫలం కావడంతో మూడో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత ముంబై 125 రన్స్ చేయగా.. రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి మరో 27 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్‌ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (54*) తన జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ 3 వికెట్లు తీశారు.