REVANTH REDDY : షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

0
19

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ముస్లీంలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని హైదరాబాద్‎లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు.., మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్‎కు ఘన స్వాగతం పలికారు. అక్కడ షబ్బీర్ అలీ, ఇతర ముస్లిం పెద్దలకు సీఎం పండుగ శుభాకాంక్షలు చెప్పారు. వేడుకల్లో భాగంగా అందరితో కలిసి విందు ఆరగించారు సీఎం రేవంత్ రెడ్డి.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి చేరుకున్నారు. సాయంత్రం హస్తినలో AICC ముఖ్య నేతలతో భేటీకానున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెండింగ్‎లో ఉన్న 3 ఎంపీ సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఢిల్లీ పెద్దలతో డిస్కస్ చేయనున్నారు. మొత్తం 17 స్థానాలకు ఇప్పటివరకు 14 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది హైకమాండ్. ఇక ప్రస్తుతం పెండింగ్‎లో ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లీడర్లతో రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది.