BREAKING : హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతను హగ్ చేసుకున్న మహిళా ఏఎస్సై.. సస్పెండ్ చేస్తూ నోటీసులు

0
22

హైదరాబాద్ : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతను ఆలింగనం చేసుకున్నందుకు సైదాబాద్ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. మాధవీలత తన నియోజకవర్గం పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సైదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీడియోలో ఉన్నదాని ప్రకారం, ఏఎస్సై మాధవీలతకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత హగ్ చేసుకున్నారు. ఇంకా మహిళా ASIని విధుల నుండి సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీచేశారు.