హైదరాబాద్ నగరంలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర

0
22

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భాగ్యనగరంలో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23 మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరంలో హోమం నిర్వహించిన అనంతరం ఈ భారీ శోభ యాత్ర ప్రారంభించారు. హైదరాబాద్‌లోని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషన్ నేతృత్వంలో నిర్వహించే ఈ యాత్రకు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో అత్యంత దూరం కొనసాగే ఈ భారీ శోభాయాత్ర గౌలిగూడ నుంచి ప్రారంభమై.. నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్, నుంచి తాడ్ బన్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగుతుంది. ఈ యాత్రకు ఈ సంవత్సరం భారీ సంఖ్యలో జనం వస్తారనే సమాచారంతో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి.. వాహనాలకు దారి మళ్లిస్తున్నారు. ఈ యాత్ర కోసం ప్రధాన కూడళ్లలో స్వచ్ఛంద సంస్థలు, హిందూ సంఘాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.