AP POLITICS : పవన్ కళ్యాణ్ నామినేషన్.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

0
13

పిఠాపురం : ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ నామినేషన్‌ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ తర్వాత ఆర్వో కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.