AP POLITICS : ప‌వ‌న్ అఫిడవిట్‎లో కొడుకు అకిరా అనంద్, కుమార్తె ఆద్య పేర్లు

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించారు. పవన్ ఐదేళ్ల సంపాద‌న రూ. 114.76 కోట్లు. ప్ర‌భుత్వానికి చెల్లించిన ప‌న్నులు రూ. 73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64.26 కోట్లు ఉన్న‌ట్లు అఫిడవిట్‎లో పేర్కొన్నారు. ఇక ఆయ‌న అంద‌జేసిన విరాళాలు వ‌చ్చేసి రూ. 20 కోట్లు. అలానే కొడుకు అకిరా అనంద్, కుమార్తె ఆద్య పేర్లను కూడా అఫిడవిట్‎లో వెల్లడించారు.