బెంగళూరులోని ఫేమస్ హోటల్ రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది ఈ ఘటనలో నలుగురు హోటల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరు హోటల్ సిబ్బంది కాగా ఇద్దరు కస్టమర్లు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి రామేశ్వరం కేఫ్‌లో ఉన్న ఫర్నీచర్, వస్తువులు ఎగిరిపడ్డాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఆర్పేందుకు యత్నిస్తున్నారు. వైట్‌ఫీల్డ్ ప్రాంత పోలీసులు.. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు.
సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఘటనాస్థలంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఫైర్ అధికారులు పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ బ్లాగర్లకు ఈ కేఫ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండేది. బెంగళూరులో ఈ కేఫ్ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇటీవలే హైదరాబాద్‌లోని మాదాపూర్ లో కూడా ఓపెన్ చేశారు. ప