EDUCATION : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

0
23

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. కాగా, ఈ రోజు విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్ 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‎లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అలాగే ఈ ఫలితాల్లో గతంతో పోలిస్తే ఫస్ట్ ఇయర్‌లో 2 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా టాప్‌లో ఉండగా.. సెంకడ్ ప్లేస్‌లో మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. అలాగే ములుగు జిల్లాలో అనూహ్యంగా ఊహించని రీతిలో పాస్ పర్సంటేజ్ పెరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి షార్ట్ మెమోలు డౌన్‎లోడ్ చేసుకోవచ్చని.. ఎటువంటి సమస్యలు తలెత్తిన అధికారిక వెబ్‎సైట్‌లో ఉన్న హెల్ప్ డెస్క్ ద్వారా తెలపాలని విద్యాశాఖ కార్యదర్శి చెప్పుకొచ్చారు. ఈ లింక్ ద్వారా మీ ఫలితాలను చూసుకోవచ్చు https://tsbie.cgg.gov.in/