TS POLITICS: కాంగ్రెస్ పార్టీ మరోసారి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది- బండి సంజయ్

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ గడ్డ మీద రిజర్వేషన్ల పంచాయతీ ఓ రేంజ్‌‌లో కొనసాగుతోంది. ఈ విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నడుమ నిప్పు రాజేస్తోంది. పొరపాటున బీజేపీని గెలిపిస్తే.. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే రేవంత్‌కు ఎంపీ బండి సంజయ్ ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ఎలాంటి రిజర్వేషన్ల రద్దు ఉండబోదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని… కాంగ్రెస్ మరోసారి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ కేవలం బీజేపీయేనని అన్నారు. హస్తం పార్టీ ఓ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా రెండు దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తైందని.. ఎక్కడ చూసినా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని.. అందుకే కాంగ్రెస్‌కు సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రేవంత్ రిజర్వేషన్ల రాగం అందుకున్నాడని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలేనని బండి సంజయ్ కొట్టిపడేశారు.