PM MODI: ప్రధాని మోదీ నామినేషన్‎కి ముహూర్తం ఫిక్స్

0
10

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసే తేదీ ఫిక్స్ అయ్యింది. వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 13వ తేదీన మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి ప్రధాని నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఉత్తరప్రదేశ్ బీజేపీ యూనిట్ అప్రమత్తమైంది. నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసే ర్యాలీ, సభకు భారీ జనసమీకరణ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోదీ మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగనున్నారు. ఇక, వారణాసిలో ప్రధాని మోదీపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ రాయ్ పోటీకి దిగుతున్నారు. వారణాసిలో పోలింగ్ జూన్ 1వ తేదీన చివరి దశలో జరగనుంది.