పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్లలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు, ఫేక్ వీడియో అంశాలపై నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ఈ తెలంగాణ నా ఊరు, నా ప్రాంతం.. నా రాష్ట్రానికి వచ్చి, నా రాష్ట్రం నడి గడ్డపై నిల్చుని నన్నే బెదిరిస్తావా అంటూ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ మండిపడ్డారు.
కాగా, ప్రధాని మోదీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. దేశంలోని పలు కీలక అంశాలపై పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని.., తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సీఎం రేవంత్ రిజర్వేషన్లు ముచ్చట తీశారని ఎంపీ అర్వింద్ అన్నారు. అంతే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మర్ఫింగ్ వీడియోను తయారు చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ప్రజలను ఆందోళనకు గురి చేశారని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు.. తన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు తీయనని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మళ్లీ అవే వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నాడని.. సీఎం రేవంత్‌పై ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు.