Breaking: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

0
19

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కవిత మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‎గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత కోర్టుకు తెలిపారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‎కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపింది. అయితే దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని.., ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ వాదించాయి. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో మరో సారి కవితకు చుక్కెదురైనట్లు అయింది.