Megastar: పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి చిరంజీవి

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ముఖ్యపార్టీల నేతలు తమ ప్రచారాలతో ప్రజల్లో జోరును పెంచుతున్నారు. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇటీవల మెగా హీరోలు, జబర్దస్త్ కమెడియన్స్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మంగళవారం ట్విట్టర్ వేదికగా జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండని ఓ వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆకరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలనే విషయంలో ముందు ఉంటాడని.., తన గురించి కంటే జనం గురించి ఆలోచించే మనస్థత్వం తన తమ్ముడు కళ్యాణ్ బాబు అని.. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ పవన్ తన సొంత సంపాదనను కాదని.., కవులు రైతుల కన్నీరు తూడిచిపెట్టడానికి ఖర్చుపెట్టడం, జవాన్, కార్మికుల లాంటి వారికి సాయం చేస్తాడన్నారు. తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా ప్రజలకు కావాల్సిందని చిరంజీవి తెలిపారు.

అంతేకాకుండా సినిమాలోకి పవన్ బలవంతంగా వచ్చాడని.., రాజకీయంలోకి మాత్రం ఇష్టంతోనే వచ్చారని చిరు అన్నారు. ఏ తల్లికైన తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని.., అలాగే ఏ అన్నకు అయిన తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాదేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలా బాధపడుతున్న తల్లికి అన్నయ్యగా ఓ మాట చెప్పారన్నారు. ఎంతో మంది తల్లుల కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పారన్నారు చిరంజీవి. జనం కోసం జన సైనికుడు అయ్యాడని.., తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయానికి అంకితం చేసిన శక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ శక్తిని వినియోగించాలంటే.. చట్ట సభల్లో అతడి గొంతు వినాలన్నారు. ‘ జనమే జయం అని నమ్మే జనసేనాని, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా నిలబడుతాడని, పిఠాపురం ప్రజల కలలను నిజం చేస్తాడని గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు.