Pawan Kalyan: బాబాయ్‎కి అబ్బాయి సపోర్ట్

0
43

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్‎కు నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సహా జనసేన తెలుగుదేశం బీజేపీ కోటపై పోటీ చేస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం జనసేనని గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్‎కి మద్దతు ప్రకటించారు. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ రాసుకొచ్చారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్‎కి మద్దతుగా జబర్దస్త్ ఆర్టిస్టులు, కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు కొంత మంది పిఠాపురం సహా రాష్ట్రంలో పోల ప్రాంతాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికల విషయానికి వస్తే సరిగ్గా వారం రోజుల్లో ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే సోమవారం నాడు అంటే మే 13వ తేదీన ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ ఫలితాలు వచ్చే నెల నాలుగో తేదీన రిలీజ్ చేయబోతున్నారు.