రాహుల్, ప్రియాంక పోటీ చేసే స్థానాలివే.!

0
26

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఇప్పటికే బీజేపీ ఫస్ట్ లిస్టును ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల ఎంపిక చేసే పనిలో ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది కానీ.. రాహుల్ అమేథీ నుంచే లోక్ సభ బరిలోకి దిగుతారని తెలుస్తోంది.

ఎన్నికల్లో యూపీలోని అమేథీ నుంచి బరిలోకి దిగనున్నారని ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ చెప్పారు. ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. కాగా.. కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిన అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రాహుల్ 2004 నుంచి పోటీ చేస్తున్నారు. 2019 మినహా మిగిలిన అన్ని సార్లు ఆయనే గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో అమేథి గెలించి తిరిగి కాంగ్రెస్ కంచుకోటను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు.

రాహుల్ సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 2019లో అమేధీ లో ఓటమీ తర్వాత రాహుల్ గాంధీ మళ్లీ అదే స్థానంనుంచి పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేయనున్నట్లు సమాచారం.