పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ విషయంపై కేంద్రం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో మీడియా మాట్లాడుతూ ట్యాపింగ్‌కు మాజీ సీఎం కేసీఆరే ప్రధాన కారణమని.. విచారణ జరిగితే కేసీఆర్ ఇరుక్కుపోవడం ఖాయమని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మేడిపల్లి సత్యం, జువ్వాడి నర్సింగరావు, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లు ట్యాప్ అయినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు జీవన్ రెడ్డి. అలానే బీఆర్ఎస్ పేరే కేసీఆర్ పట్ల భస్మాసుర అస్త్రంగా మారిందని.. పార్టీ పేరు మార్చడంతోనే కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ఓ కారణం అయిందని విమర్శించారు.
Home పాలిటిక్స్ తెలంగాణ Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌కు మాజీ సీఎం కేసీఆర్ ప్రధాన కారణం- జీవన్ రెడ్డి