Nivedha: పోలీసులకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన హీరోయిన్ నివేదా.. కారు డిక్కీ ఓపెన్ చేయమన్నందుకు లొల్లి

0
14

పాయింట్ బ్లాంక్, సినిమా: ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోను యాక్టీవ్‌గా ఉంటూ మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్ లో అదరగొడుతూ కప్పులు గెలుస్తుంది. అయితే తాజాగా నివేదా పేతురేజ్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.

కాగా, నివేదా పేతురేజ్ కారులో వెళ్తుంటే పోలీసులు చెకింగ్ కోసం ఆపి వెనక డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా.. నేను ఎందుకు చేయాలి.. నేను చేయను.. కావాలంటే పేపర్లు అన్ని కరెక్ట్‎గా ఉన్నాయి చూసుకోండి అంటూ పోలీసులతో గొడవ పడింది. ఇదంతా రికార్డ్ చేస్తుంటే ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అంటూ కెమెరాని తన చేత్తో మూసేసింది. దీంతో ఈ వీడియో వైరల్‎గా మారింది. అయితే నిజంగానే నివేదా పేతురేజ్ తన డిక్కీలో ఏమైనా తీసుకెళ్తుందా..? పోలీసులకు చెకింగ్ కి సహకరించడానికి ఎందుకు భయపడుతుంది అని పలువురు కామెంట్స్ చేస్తుంటే.. ఈ వీడియో చూస్తుంటే ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసినట్లు ఉంది. పోలీస్, నివేదా ఎక్స్‌ప్రెషన్స్ కూడా యాక్టింగ్ చేసినట్టే ఉన్నాయి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి నివేదా పేతురేజ్ ని నిజంగానే పోలీసులు ఆపారా..? లేక ఇదంతా ప్రమోషన్ స్టంటా అనేది తెలియాల్సి ఉంది.