Trending: నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన శునకం

0
35

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిర ఆవరణలో ఉన్న నవ గ్రహాల చూట్టూ ఓ శుకనం 11 ప్రదక్షిణలు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కాగా, శని జయంతి రోజు భక్తులు విధిగా నవగ్రహారాధన చేసి ప్రదక్షిణలు చేస్తారు. కానీ, ఓ శునకం ఎవరో చెప్పినట్లుగానే 11 ప్రదక్షిణలు చేయడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపి‌క్‌గా మారింది. ఇది యాధృచ్ఛికమా.. లేక దైవ మాయా అన్న ఆలోచనలో గ్రామస్థులు ఉన్నారు.