CID Raids: ఏపీ బేవరేజెస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం పాలసీ పేరిట దోపిడీ పర్వానికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో శుక్రవారం ఐడీ సోదాలు చేపట్టింది. వాసుదేవరెడ్డి హైదరాబాద్‎లోని నానక్‎రామ్‎గూడలో నివాసం ఉంటున్నారు. ఈ ఉదయాన్నే వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు వివిధ కీలక పత్రాలను తనిఖీ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్‎కు వాసుదేవరెడ్డి బలమైన మద్దతుదారుడు అని ప్రచారంలో ఉంది. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలు అనధికార మార్గాల్లో వైసీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర అని, తద్వారా మద్యం రూపంలో వైసీపీకి భారీ ఆదాయం లభించిందన్న ఆరోపణలు ఉన్నాయి.