Modi: ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు- నరేంద్ర మోదీ

0
10

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ తెల్లవారుజామున 4.50కి రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. కాగా, రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

రామోజీ రావు మరణం ఎంతో బాధాకరం. భారతీయ మీడియాలో విప్లవాత్మక వార్పులు తీసుకొచ్చిన దార్శనికుడని.. ఆయన సేవలు సినీ, పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయన్నారు మోదీ. తన అవిరళ కృషి ద్వారా.. మీడియా, వినోద ప్రపంచాల్లో శ్రేష్ఠమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారని.., ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారన్నారు. ఆయనతో సంభాషించేందుకు, ఆయన నుంచి అపారమైన జ్ఞానాన్ని పొందేందుకు అవకాశం రావడం నా అదృష్టమని. ఈ విచారకర సమయంలో రామోజీ కుటుంబసభ్యులు, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నరేంద్ర మోదీ.