రామోజీ అంటేనే క్రమశిక్షణ- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

0
9

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ తెల్లవారుజామున 4.50కి రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. కాగా, రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఆత్మీయుడు రామోజీ మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానట్లు… క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఆయన సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమని అన్నారు వెంకయ్యనాయుడు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. ఆయన ఓ వ్యక్తి కాదు.. శక్తిమంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం నుంచి యువతరం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.