Delhi: నిర్మలా సీతారామన్‌ రికార్డు

0
28

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో ఆదివారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత మోడీ మంత్రివర్గంలో స్థానం సంపాదించడం ద్వారా వరుసగా మూడోసారి కేంద్రమంత్రిగా కేబినెట్‌లో చేరిన ఏకైక మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు దక్కించుకున్నారు. ప్రధాని గత ప్రభుత్వంలో ఆమె కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ప్రధానంగా రెండోతరం ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంతో ఆమె అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 2014లో తొలిసారి ప్రధాని మోడీ కేబినెట్‌లో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా చేసిన నిర్మలా సీతారామన్, 2017లో రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం పాలైనప్పుడు నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి ఆర్థిక మంత్రి అయిన మహిళగా రికార్డులకెక్కారు. అంతకుముందు ఇందిరా గాంధీ భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో స్వల్ప కాలానికి ఆర్థిక శాఖను కూడా తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకున్నారు.