Breaking: కేసీఆర్‌కు విద్యుత్ ఒప్పందంపై నోటీసులు

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల ఫలితాల్లో వరుస ఓటములతో సతమవుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు జస్టిస్ నరసింహారెడ్డి. ఈ నెల 30లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ నోటీసుల్లో వివరణ కోరింది. అయితే కేసీఆర్ జులై 30 వరకు తమకు సమయం కావాలని కోరారు. ఇటీవల తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో అవినీతిపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సెషన్‌లో విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. ఇక, నోటీసులకు కేసీఆర్ ఇచ్చే వివరణపై ఉత్కంఠ నెలకొంది.