Ysr Cheyutha: నేడు వైఎస్సార్ చేయూత నిధులు రిలీజ్

0
28

వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా నేడు నాలుగో విడత నిధులను ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరగనున్న సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో రూ.18,750 జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కింద రాష్ట్రవ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ. 18,750 ఇస్తున్నారు.

నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్కమహిళకు రూ.75వేల సాయం అందనుంది. ఇప్పటివరకు ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేసింది. కాగా వైసీపీ ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

సీఎం జగన్‌ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోట చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ చేరుకుని.. ‘వైఎస్సార్‌ చేయూత’ 4వ విడత నిధులను బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. సీఎం పర్యటన దృష్ట్యా.. అనకాపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.