ఈ సారి మహా శివరాత్రి ఎప్పుడంటే.. సమయం ఇదే!

0
14

శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. ఆ రోజు కోసం శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక ఈ ఏడాది శివరాత్రి మార్చి 8న వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9న సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది.

శుక్రవారం లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండటంతో 8న మహాశివరాత్రిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి.

మహా శివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి.. ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివ భక్తుల నమ్మకం. మహా శివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి, పైన బిల్వ పత్రాలు, పువ్వులు, బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి.

మహా శివరాత్రి రోజున కచ్చితంగా జాగరణ(నిద్ర పోకుండా) ఉండాలని, ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.