Mega Family: ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి వచ్చిన మెగా కుటుంబం

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవి లభించడంతో మెగా కుటుంబంలో ఆనందం అంబరాన్నంటుతోంది. కేసరపల్లి ఐటీ పార్కు వద్ద జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో వచ్చారు. నాగబాబు, సురేఖ, సాయిదుర్గాతేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య తదితరులు ప్రత్యేక బస్సులో సభ వద్దకు వచ్చి ప్రమాణస్వీకార మహోత్సవాని చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.