Megastar: సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు హార్దిక శుభాకాంక్షలు

0
22

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భరంగా సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తాజాగా ‘ఎక్స్'(ట్విట్టర్ ) ద్వారా టీడీపీ అధినేతకు కంగ్రాట్స్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడుకి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్‎కి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.. ఆశిస్తున్నాను.!! అంటూ చిరు ట్వీట్ చేశారు. అలాగే తన భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్‎లతో కలిసి చంద్రబాబును కలిసిన ఫొటోలను చిరంజీవి పంచుకున్నారు.