పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయగా.., మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. గురువారం సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై గురువారం అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తనవద్దనే ఉంచుకున్నారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్‌కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు.
1. సీఎం చంద్రబాబు- సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు
2. పవన్ కళ్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
3. నారా లోకేష్- మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)
4. వంగలపూడి అనిత- హోంశాఖ, విపత్తు నిర్వహణ
5. అచ్చెన్నాయుడు- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక
6. కొల్లు రవీంద్ర- గనులు, జియాలజీ, ఎక్సైజ్
7. నాదెండ్ల మనోహర్- ఆహార, పౌరసరఫరాలు
8. పొంగూరు నారాయణ- మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
9. సత్యకుమార్ యాదవ్- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
10. నిమ్మల రామానాయుడు- జలవనరుల అభివృద్ధి
11. ఎన్‍ఎండీ ఫరూక్- న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం
12. ఆనం రామనారాయణరెడ్డి- దేవదాయ
13. పయ్యావుల కేశవ్- ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నులు
14. అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
15. కొలుసు పార్థసారథి- గృహనిర్మాణం, సమాచార శాఖ
16. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు
17. గొట్టిపాటి రవికుమార్- విద్యుత్ శాఖ
18. కందుల దుర్గేష్- పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
19. గుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
20. బీసీ జనార్ధన్ రెడ్డి- రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు
21. టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి
22. ఎస్.సవిత- బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత
23. వాసంశెట్టి సుభాష్- కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు
24. కొండపల్లి శ్రీనివాస్- ఎంఎస్‍ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు
25. మండిపల్లి రామ్‍ప్రసాద్ రెడ్డి- రవాణా, యువజన, క్రీడలు