పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన సెలక్ట్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా, కేరళ వరదల విపత్తుల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మరచిపోలేదని.. మరిన్ని విశిష్ట సేవలు అందించి ఉద్యోగులు, యువతకు స్ఫూర్తి నివ్వాలని తెలిపారు. ప్రస్తుతం కృష్ణ తేజ త్రిస్సూర్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.