Breaking: ఎన్‎కౌంటర్‎లో 8 మంది మావోయిస్టులు హతం.. ఓ జవాన్ మృతి.

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దు నారాయణపూర్‌ జిల్లాలోని అబుజ్‌మద్ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య శనివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులతో పాటు ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. కుతుల్, ఫర్సాబెడ, కొడమెట ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నారాయణపూర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన సుమారు 1400 మంది భద్రతా సిబ్బందిని ఈ నెల 12వ తేదీన మోహరించారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా నారాయణపూర్ జిల్లాలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అయితే శనివారం ఉదయం నక్సలైట్ల స్థావరాన్ని సైనికులు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.