AP Politics: తనిఖీల్లో బయటపడ్డ భారీ దోపిడీ

0
22

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా చేపట్టిన తనిఖీల్లో భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. తెనాలిలో నిల్వగోదాములు తనిఖీ చేయగా పంచదార, కందిపప్పు, నూనె.. తదితర ప్యాకెట్ల బరువు 50-100 గ్రాములు తక్కువగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. అనంతరం, మంగళగిరిలో చేసిన తనిఖీల్లోనూ ఇదే బాగోతం వెలుగు చూసింది. దీంతో, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీని నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. ఈ దోపిడీపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది రాష్ట్రంలో బయటపడ్డ భారీ కుంభకోణమని అన్నారు.

కాగా, ప్యాకెట్ల తూకంలో ఇంత తేడా ఉన్నా అదేమంత పెద్ద విషయం కానట్టు అధికారులు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇంత పెద్దమొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా? అన్నట్టు వ్యవహరించారట. ఒక్క తెనాలిలోనే ఇలా ఉందా..? మిగితా చోట్ల కూడా ఇదే పరిస్థితా అన్న ప్రశ్నకు అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. దీంతో, మంత్రి మంగళగిరిలో తనిఖీలకు ఆదేశించగా అక్కడా ఇదే బాగోతం వెలుగు చూసింది.