Sucide: గోమతి నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఓ ప్రేమ జంట.

0
36

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఉత్తరప్రదేశ్ సుల్తాన్‎పూర్‎లోని గోమతి నదిలో ఓ ప్రేమ జంట దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వారి పనిని గమనించిన అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు. అయితే ఒడ్డుకు చేరుకున్నాక సదరు మత్స్యకారుడు ప్రియుడి చెంప చెల్లుమనిపించాడు. జీవితం ఎంత విలువైందో చెబుతూ మూడు నాలుగు సార్లు చెంపవాయించాడు. దీంతో బిత్తరపోయిన సదరు యువకుడు మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. కాగా ఈ ఘటనలో ఈ ప్రేమ జంట ప్రాణాలకు ముప్పేమి లేదని పోలీసులు చెప్పారు.