KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గత తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి మతహింస జరగలేదని.. తెలంగాణ శాంతియుతంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లా&ఆర్డర్ రెండూ లేవని విమర్శించారు. గతంలో ఎప్పుడూ మతపరమైన కార్యకలాపాలు జరగని.., ప్రశాంతమైన మెదక్ పట్టణంలో హింస చెలరేగడం నిజంగా సిగ్గుచేటు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మెదక్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని.., మెదక్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మెదక్‌లో హింసకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.